FbTelugu

కరోనా పేషెంట్ కు రూ.8.35 కోట్ల బిల్లు

న్యూయార్క్: గడ్డు కాలంలో కరోనా నుంచి కోలుకొని బయటపడిన ఓ పేషెంటుకు ఆస్పత్రి ఇచ్చిన బిల్లు చూసి కళ్లు భయళ్లు కమ్మాయి. వివరాల్లోకెళితే.. అమెరికాలో మైఖేల్ ఫ్లోర్ అనే 70 ఏళ్ల వృద్దుడు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరాడు.

ఏకంగా 62 రోజులు కరోనాతో పోరాడి కరోనాను జయించాడు. కానీ ఆస్పత్రి వారు అతనికి ఇచ్చిన బిల్లు చూసి ఆ వృద్ధుని తల గిర్రున తిరిగింది. అతనికి ఏకంగా 1.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.35 కోట్లు) బిల్లు ఇచ్చారు. ఈ వార్త విన్న ఎవ్వరైనా.. అంత బిల్లా అంటూ కళ్లు తేలెస్తున్నారు.

You might also like