FbTelugu

తిరుపతిలో 7వ డివిజన్ ఎన్నిక రద్ధు

తిరుపతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్​ఈసీ) తిరుపతి నగర పాలక సంస్థ (టీఎంసీ) ఏడో డివిజన్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం వెల్లడించింది.

అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుపై సంతకం ఫోర్జరీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్నిక రద్దు ఆదేశాలు వెంటనే అమల్లోకి తేవాలని జిల్లా కలెక్టర్ ను సూచించింది. విచారణ పూర్తయ్యాక ఎన్నికకు సంబంధించి ఏం చర్యలు తీసుకోనున్నది తెలియచేస్తామని ఎస్ఈసీ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.