FbTelugu

కరోనాతో ఒక్కరోజే 780 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల వ్యవధిలో 1,31,968 మందికి కరోనా పాజిటివ్ సోకగా, 780 మంది ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్ లో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు దేశంలో కేసుల సంఖ్య 1.30 కోట్లు దాటగా, 1,67,642 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులు ఉండగా ఒకేరోజులో 61,899మంది కోలుకున్నారు. గురువారం నాడు 36,91,511 మందికి వ్యాక్సిన్లు వేయగా ఇప్పటి వరకు 9,43,34,262 మందికి వ్యాక్సిన్ వేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. గురువారం నాడు 56వేల కేసులు రాగా 376 మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.