FbTelugu

78.55 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 78,55,477 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 4,31,728 మంది మృత్యువాత పడ్డారు.

కాగా ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 40,22,159 కి చేరింది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 21,42,205, కేసులు నమోదైనాయి. 1,17,526 మంది మృత్యువాత పడ్డారు.

You might also like