FbTelugu

కలుషిత ఆహారం తిని 76 మంది అస్వస్థత

విశాఖపట్నం: ఏజెన్సీ లోని జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామంలో కలుషిత ఆహారం తిని 76 మంది అస్వస్థత కు గురయ్యారు.

ఇందులో ఐదుగురుపరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్నవారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి స్థానిక పీహెచ్ సీలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కుటుంబ వేడుకలో వడ్డించిన భోజనం తీసుకోవడం మూలంగా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి హుటాహుటిన పాడేరుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

You might also like