FbTelugu

బ్లాక్ ఫంగస్ టెస్టులకు రూ.7500 ఖరారు

బెంగళూరు: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. బిపిఎల్ కార్డుదారులు అయితే రూ.7500, ఏపిఎల్ కార్డుదారులకు రూ.10 వేలు ఖరారు చేశారు.

బ్లాక్ ఫంగస్ వస్తే మెదడు ఎంఆర్ఐ స్కానింగ్, పారామీసల్ సైనసల్, కంటికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ మూడు టెస్టులు అత్యంత ఖరీదుతో కూడుకున్నవిగా ఉండడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ టెస్టు ధరలను నిర్ణయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.