FbTelugu

75 గజాలకు అనుమతి అవసరం లేదు: కేటీఆర్

హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో 75 చదరపు గజాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో టీఎస్ బీపాస్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు భాషల్లో వెబ్ సైట్ ను డిజైన్ చేశారన్నారు. దరఖాస్తుదారుడు స్వీయ ధృవీకరణ తో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. అది కూడా నిర్ణీత గడువులోగా అనుమతులు లభిస్తాయని ఆయన వివరించారు.

75 గజాలకు అనుమతి అవసరం లేదు: కేటీఆర్600 చదరపు గజాల లోపు, 10 మీటర్ల ఎత్తు లోపు భవనాలకు స్వీయ ధృవీకరణ దరఖాస్తు చేసుకుంటే అనుమతి వస్తుందన్నారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేసుకునేవారికి 21 రోజుల్లో అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మొబైల్ యాప్, వెబ్ ఫోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న చట్టాలు దేశానికి మర్గదర్శకం కానున్నాయని అన్నారు. టీఎస్ బీపాస్ విధానం గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని, బీపాస్ ద్వారా వచ్చిన పత్రమే మీకు ఆయుధమన్నారు. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన చట్టం తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.