FbTelugu

తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవ్వాళ 71 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకటించింది.

ఇవ్వాళ ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 57 మంది చనిపోయారు. 650 యాక్టివ్ కేసులు ఉండగా, ఇవాళ 120 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 38, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 12 పాజిటివ్ కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట లో ఒకటి చొప్పున కేసులు వచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.