FbTelugu

ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో మరో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,332 కు చేరింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 31 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

287 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,014 గా ఉంది. అత్యధికంగా కర్నూలులో 386, గుంటూరులో 287, కృష్ణాలో 246, చిత్తూరు 80, అనంతపురం 60 కేసులు నమోదైనాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.