అమరావతి: ఏపీలో కరోనా కేసులు 14 వేల మార్కును దాటాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో 14,595కు కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. నేడు కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీకి చెందిన 648 మందికి రాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి కరోనా సోకింది. విదేశాల నుంవి వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్ ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందగా, ఏపీలో మొత్తం 187 కరోనా మరణాలు సంభవించాయి.