FbTelugu

ప్రసాదం తిని 70 మంది ఆసుపత్రిపాలు

జైపూర్: దుంగార్ పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలోని శివాలయంలో పంపిణీ చేసిన ప్రసాదాన్ని తిన్నవారిలో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయంలో నిన్న వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. శివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు ప్రసాదం పంపిణీ చేశారు.

ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తరువాత మరొకరు వాంతులు చేసుకోవడం, సొమ్మసిల్లి పడిపోవడంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అంబూలెన్స్ లలో తరలించారు. ప్రసాదం పాచిపోవడంతో తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.