FbTelugu

గాంధీలో రోజుకు 70 మంది మృతి: ఎంపి కోమటిరెడ్డి

భువనగిరి: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో రోజుకు 70 మంది చనిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో 30-40  మరణాలను చూపిస్తున్నారని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిఎం కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గా భువనగిరి ఏరియా హాస్పిటల్, బిబినగర్ ఎయిమ్స్ కు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 25 ఆక్సిజన్ సిలిండర్ల చొప్పున అందచేశారు. భారతదేశం ఈరోజు గొప్ప స్థితిలో ఉందంటే ఆరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు కారణం అన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో మంచిగా ఉన్న కరోనా బాధితులతో కెసిఆర్ మాట్లాడారని, ఇది నాటకాలు ఆడే సమయం కాదిని విమర్శించారు. పక్క రాష్ట్రాలలో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అది చేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రంలో కరోనా రోగుల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడుడుతుంటే, మన ముఖ్యమంత్రి కనీసం టస్ట్ లు కూడా చేయట్లేదన్నారు. ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతానని అసెంబ్లీలో డాంబికాలు పలికిన కెసిఆర్ ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఏపిలో ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనాకు ఉచితంగా చికిత్స అందిస్తుండగా, ఇక్కడ మాత్రం ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షల రూపాయల్లో బిల్లులు వేస్తున్నా నియంత్రించడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తూర్పారబట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.