FbTelugu

భార్య ఆచూకీ చెబితే రూ.70 లక్షలు ఇస్తా!

దుబాయ్: విహార యాత్రలో భార్య మిస్పింగ్ కావడంతో ఆమెను వెతికేందుకు భర్త భారీ నజరానా ప్రకటించారు. ఆమె ఆచూకి చెప్పినా, ఆనవాళ్లు కనుగొన్నా వారికి లక్ష డాలర్లు బహుమానంగా ఇస్తానని పర్మర్ గుర్షరాంజిత్ సింగ్ తెలిపారు.
పర్మర్ ఆయన భార్య గియడ్రే వాస్కైట్ (33) కొద్ది రోజుల క్రితం మాల్దీవుల ట్రిప్ కు వెళ్లారు. ఆమె ఉన్నట్లుండి ఫిబ్రవరి 13వ తేదీన అదృశ్యమైంది. పోలీసులు, స్థానికులు వారం రోజుల పాటు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

ఇక చేసేది లేక భర్త పర్మర్ పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. నిండు గర్భంతో ఉన్న భార్య ఎక్కడైనా ప్రమాదానికి గురైందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయిందా అనేది తెలియడం లేదని పోలీసులకు వివరించాడు.
నీళ్లలో మునిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా, ఆమె స్విమ్మర్ అని అంత తేలిగ్గా మునిగిపోదని అన్నారు. ఒకవేళ మునిగితే రెండు మూడు రోజులకు అయినా శవం పైకి వస్తుందని, ఎక్కడా తేలలేదని చెప్పాడు. ఎలాగైనా సరే భార్య ఆచూకి కనిపెట్టాలనే లక్ష్యంతో ఆయన నగదు బహుమతి ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.