FbTelugu

7 స్క్రీన్ ల లాపీ వచ్చేసింది!

ఇప్పటి వరకు మనం రెండు స్క్రీన్ ల ల్యాప్ టాప్ డెస్క్ టాప్ ను చూశాం. తాజాగా ఏడు స్క్రీన్ ల ల్యాప్ టాప్ వచ్చేసింది. ప్రపంచంలోనే మొదటిసారి ఎక్స్ పాన్ స్కేప్ అనే కంపెనీ ఏడు స్క్రీన్ ల ల్యాప్ టాప్ అరోరా7ను తయారుచేసింది.

అరోరా7 అనే మోడల్ తో వస్తున్న దీని బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ తెరలపై పనిచేసే కంటెంట్ నిపుణులు, సైబర్ నిపుణులు, డేటా సైంటిస్టులకు ఇది బాగా ఉపయోగపడనున్నది. నాలుగు 4 కే రెజల్యూషన్, మిగతా మూడు 1200 ఫుల్ హెచ్ డీ స్క్రీన్ లు కలిగి ఉండడం విశేషం. ఐ9 9900 ప్రాసెసర్, 64 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజి సౌకర్యం కల్పించారు. ఒక్కసారి ఛార్జీ చేస్తే కనీసం గంట పాటు పనిచేసుకోవచ్చు. పెట్టె మాదిరి ఉండే ఈ ల్యాప్ టాప్ ను తెరిచేందుకు పదమూడు దశల ఫోల్డింగ్ వ్యవస్థ ఉంది. త్వరలో ఇది మార్కెట్ లోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.