FbTelugu

తెలంగాణలో 7 కేసుల నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా బుధవారం నాడు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్ లో ప్రకటించింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016 కు చేరుకోగా ఇవాళ 35 మందిని డిశ్చార్జీ చేశారు. కోలుకున్న వారిలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిన్నారి కూడా ఉంది. గత నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

తక్కువ సంఖ్యలో పాజిటివ్ టెస్టులు చేయడం మూలంగానే తక్కువ కేసులు బయటపడుతున్నాయని ఇవాళ పీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

You might also like