నిన్న (మంగళవారం) మెక్సికోలో భారీ భూకంపం సంభవించినట్టుగా ఆ దేశ మీడియా ప్రకటించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7 గా నమోదైనట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రతతో అనేక ఇళ్లు, భవనాలు కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లనుంచి భయటికి వచ్చి పరుగులు తీశారు.
భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ భూకంపంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది.