FbTelugu

6, 7, 8 తరగతులు ప్రారంభం: మంత్రి సబితారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ ఒకటవ తేదీలోగా ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చని ఆమె వివరించారు. ప్రతి పాఠశాల, విద్యా సంస్థ కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. అయితే పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశామని మంత్రి సబితారెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.