FbTelugu

24 గంటల్లో 6,977 పాజిటివ్ కేసులు

ఢిల్లీ: లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 154 మంది మరణించారు.

రికార్డు స్థాయిలో కొత్తగా 6,977 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత వారం రోజులుగా కేసుల సంఖ్య ఐదు వేలకు తక్కువ నమోదు కావడం లేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలను ప్రకటించింది.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,845 కాగా యాక్టివ్ కేసులు 77,103 ఉన్నాయి. కోలుకున్నవారు 57,720, మృతులు 4,021 వరకు ఉన్నారు.

You might also like