FbTelugu

దేశంలో 68వేలు, మహారాష్ట్రలో 40వేల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా 68,020 కొత్త కేసులు వెలుగుచూడగా, ఒక్క మహారాష్ట్రలోనే 40,414 కేసులు నమోదు అయ్యాయి.

గడచిన 24 గంటల్లో 9,13,319 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 68,020 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దేశంలో మొత్తంగా కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 20లక్షల మార్కును దాటింది. 291 మంది చనిపోగా ఇప్పటి వరకు 1,61,843 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక, పాజిటివ్ కేసుల్లో పెరుగుదల మూలంగా వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటడం ప్రభుత్వాలను కలవరపెడుతున్నది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయానికొస్తే మార్చి 28న కేవలం 2,60,653 మందికి మాత్రమే డోసులు అందాయి. ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారి సంఖ్య 6,05,30,435కి చేరింది.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో లాక్ డౌన్ విధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సిఎం ఉద్ధవ్ థాకరే అధికారులను ఆదేశించారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ ఆంక్షలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.