FbTelugu

ఏపీలో ఒక్క రోజే 68 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 10,376 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో కరోనాతో 68 మంది మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,40,933 కి చేరింది. కాగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,349 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 63,864 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 75,720 కి చేరింది.

You might also like