FbTelugu

గత 24 గంటల్లో కొత్తగా 68 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా మరో 68 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఏపీవైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఈ తాజా కేసులతో ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,407 కు చేరిందని తెలిపింది.

అయితే ఇప్పటివరకు కరోనాతో ఏపీలో మొత్తం 53 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుని 1,639 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 715 కు చేరింది.

You might also like