FbTelugu

ఒక్కరోజే కరోనాతో 67 మంది మృతి

ఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 33,050 కి చేరింది. కాగా 8,325 మంది ఈ మహమ్మారి బారి నుంచి బయట పడ్డారు.

భారత్ లో గడిచిన ఒక్క రోజులోనే కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కాగా నిన్న ఒక్క రోజే 67 మంది కరోనా మహమ్మారితో మరణించారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,074 కు చేరింది.

You might also like