FbTelugu

ఏపీలో ఒక్కరోజే 65 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక్కరోజే 65 మంది మృతి చెందారు. అదే విధంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గడచిన 24 గంటల్లో 6,045 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

దీంతో ఈరోజు వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,713 కు చేరుకున్నది. ఇప్పటి వరకు 823 మంది చనిపోయారు. కర్నూలులో 678, అనంతపురంలో 325, పశ్చిమ గోదావరిలో 672 చొప్పున రాగా జిల్లాల్లో మిగతా కేసులు వచ్చాయి.

You might also like