FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 648 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 37,724 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో కరోనాతో 648 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191 కి చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 28,732 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,11,133 కి చేరింది. కరోనా బారినుంచి ఇప్పటివరకు 7,53,050 మంది కోలుకున్నారు.

You might also like