FbTelugu

60 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మహమ్మారి వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టకపోవడం, ఇప్పటికే పలు దేశాల్లో పరిస్థితులు చేజారి పోవడంతో కరోనా వ్యాప్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

ప్రస్తుతం ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,26,375 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 3,66,418 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారి నుంచి నేటివరకు 26,56,144 మంది కోలుకున్నారు.

You might also like