FbTelugu

వర్గపోరులో 60 మంది మృతి

డార్పర్: సూడాన్ లో ముసలిట్, ఇతర అరబ్ తెగల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో 60 మంది వరకు మృతి చెందగా మరో 60 మందికి పైగా గాయపడ్డారు.
పశ్చిమ ప్రావీన్స్ రాజధాని జేనేనాకు దక్షిణాన 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న మస్తేరిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని యూఎస్ ఆఫీసు ఫర్ ద కో ఆర్డినేషన్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ ప్రకటించింది.

శనివారం సాయంత్రం ఒక వర్గానికి చెందిన 500 మంది తుపాకులతో మస్తేరి గ్రామంపై దాడికి దిగారు. ఈ దాడి ఆదివారం తెల్లవారు జాము వరకు కొనసాగింది. పరస్పరం జరిగిన దాడిలో 60 మంది వరకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 60 మందిని చికిత్స కోసం హెలీకాప్టర్ లో జేనేనా పట్టణంలోని హాస్పిటల్ కు తరలించారు.

You might also like