FbTelugu

ఆటో ప్రమాదంలో 6గురు మృతి

కృష్ణా: గొల్లపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో ఆరుగురు కూలీలు మరణించారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్షతగాత్రులను విజయవాడ, నూజివీడు ఆస్పత్రులకు తరలించారు.
నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, బాధితులను నూజివీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతుల పేర్లు రమేష్, నాగరాజు, బాణావతు స్వనా, భూక్య సోమ్లా, బర్మావత్ బేబీ.. ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తిని బాణావతు నాగుగా అధికారులు గుర్తించారు.

బతుకుదెరువుకోసం వెళ్తూ గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాధానికి గురై ఆరుగురు కూలీలు మృతి చెందిన ఘటన మనసు కలచివేసిందని ఏపీ ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. వారి ఆత్మకు శాంతికలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి తనను ఎంతో బాధించింది, కలిచివేచిందని ఆళ్ల నాని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.