FbTelugu

లాక్ డౌన్ ఎత్తివేతకు 6 కమిటీలు

నేటి మధ్యాహ్నం 3 గంటలలోగా బ్లూ ప్రింట్

అమరావతి: దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని నరేంద్ర  మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది.

ఇవాళ మధ్యాహ్నం 3గంటల లోగా బ్లూ ప్రింట్స్ ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ ప్రభుత్వం, అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో షాపులు, ఇతర కార్యకలాపాలకు 2 కమిటీలు ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీస్‌కు, వ్యవసాయ, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అయ్యాయి. ప్రజా రవాణాకు ముగ్గురు సభ్యులతో, ప్రభుత్వ రంగ నిర్మాణాలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిటీ పనిచేయనున్నది.

ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లకు ప్రాతినిధ్యం కల్పించారు.

You might also like