FbTelugu

కరోనాతో 6-42 లక్షల మంది చనిపోలేదు: భారత్

న్యూయార్క్ టైమ్స్ కథనానికి ఖండన
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ సోకి కేవలం మూడు లక్షల మందే చనిపోయారని, వాస్తవంగా 6 లక్షల నుంచి 42 లక్షల మంది చనిపోలేదని భారత ప్రభుత్వం ఖండించింది. కరోనా చావులపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని భారత్ శనివారం నాడు తోసిపుచ్చింది.

భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా అధికారిక మరణాల సంఖ్య కన్నా కరోనా మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య ఆరేడు రెట్లు అధికంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ మే వ తేదీన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం నిరాధరమైందని, అంటు వ్యాధుల వ్యాప్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డదిడ్డమైన డేటాతో రాశారని అభ్యంతరం తెలిపింది. ఐసిఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా మరణాలు నమోదు చేస్తుననాయి. రోజుల జిల్లాల వారీ కేసులు, మరణాలు సేకరించి అధికారికంగా ప్రకటిస్తున్నామని భారత ప్రభుత్వం సమర్థించుకున్నది. అధికారిక లెక్కల ప్రకారం మూడు లక్షల మంది మాత్రమే చనిపోయారని, న్యూయార్క్ టైమ్స్ చెప్పిన విధంగా 6 లక్షల నుంచి 42 లక్షల వరకు చనిపోలేదని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.