FbTelugu

త్వరలో 5జీ టెక్నాలజీ: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో త్వరలో 5జీ మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నదని, వీలైనంత త్వరాగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని టెలికాం రంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
ఇవాళ మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఈ టెక్నాలజీ రాకతో భవిష్యత్తులో అవకాశాలను యువతకు కల్పించేందుకు మార్గం సుగమం చేయాలన్నారు. దీంతో పాటు టెలికాం రంగం, మొబైల్ తయారీ, పరిశోధనకు భారత్ ను కేంద్రంగా మార్చాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేయడానికి మొబైల్ టెక్నాలజీని భారీ ఎత్తున వినియోగించునన్నామని నరేంద్ర మోదీ తెలిపారు.

మహమ్మారి సమయంలో కోట్లాది రూపాయల ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు మొబైల్ టెక్నాలజీ ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగ పడిందన్నారు. ఇండియాలో అతి పెద్ద వ్యాక్సినేషన్ జరగబోతున్నదని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.