FbTelugu

తెలంగాణలో 5926 పాజటివ్ కేసులు

24 గంటల్లో 18 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల వరకు 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు వెల్లడి అయ్యాయి.

మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 18 మృతి చెందగా మృతుల సంఖ్య 1,856కి చేరింది. కరోనా బారి నుంచి 24 గంటల వ్యవధిలో 2,209 మంది కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.