FbTelugu

భారత్ లో 24 గంటల్లోనే 5,609 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. భారత్ లో 24 గంటల్లోనే 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గడిచి 24 గంటల్లోనే 132 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,12,359 కి చేరింది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 45,300 లకు చేరింది. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 63,624 గా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 3,435 మంది ప్రాణాలు కోల్పోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.