FbTelugu

త్వరలో 560 వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు

అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు ఇవ్వాళ అనుమతులు జారీ చేసింది.

క్లినిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని, 205 పాత భవనాలకు మరమ్మత్తులు చేసి సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీ నగరం మాదిరి ఏపీలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.