FbTelugu

భారత్ లో కొత్తగా 55,079 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 876 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షలు దాటేసింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 19.77 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6.73 లక్షల యాక్టీవ్ కేసులున్నాయి. మొత్త మృతుల సంఖ్య 51,797కి చేరింది.

You might also like