FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 55,079 కేసులు

న్యూఢిల్లి: భారత్ లో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 779 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

దేశంలో తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,38,871 కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 35,747 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో 10,57,806 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,45,318 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like