FbTelugu

ఏపీలో కొత్తగా 54 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్తగా మరో 54 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనాయి. ఒకరు మృతిచెందారు. ఏపీ హెల్త్ బులెటిన్ ను తాజాగా వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.

నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 59కి చేరింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,958 కి చేరింది. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 824 కి చేరింది.

You might also like