FbTelugu

ఒక్కరోజులో 52,972 పాజిటివ్ కేసులు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,972 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా 771 మరణాలు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,03,696కి చేరగా, వివిధ ఆసుపత్రుల్లో 5,79,357 మంది చికిత్స పొందుతున్నారు. 11,86,203 మంది కోలుకుని డిశ్చార్జి కాగా కరోనాతో ఇప్పటి వరకు 38,135 మంది మృతి చెందారు.

You might also like