FbTelugu

ఇంద్రకీలాద్రిపై 52 మందికి పాజిటివ్

ముగ్గురు ఉద్యోగులు మృతి
విజ‌య‌వాడ‌: కనకదుర్గమ్మ ఆలయంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ఇంద్రకీలాద్రిపై 52 కు చేరుకున్నది. జమలమ్మ అనే అటెండర్ మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది.

కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు ముగ్గురు మృతి చెందడంతో ఇంద్రకీలాద్రిపై కఠిన ఆంక్షలు విధించారు. భక్తుల రాకను నిలువరించేందుకు ఆలయ దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దుర్గమ్మ దర్శనం వేళలు అని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.