అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2282 కు చేరుకున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 705 మంది కాగా, ఇప్పటి వరకు కోలుకుని 1527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి దాకా ఏపీ లో కరోనా పాజిటివ్ తో 50 మంది మృతి చెందారు. అత్యధికంగా కర్నూలులో 615 కేసులు, గుంటూరులో 417, కృష్ణా జిల్లాలో 382 కు కేసులు నమోదు అయ్యాయి.