FbTelugu

‘50 వేల సాధు సంతులతో చలో రామతీర్థం’

* పిలుపునిచ్చిన అఖిల భారత హిందూ మహాసభ
విజయవాడ : విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా త్వరలో 50 వేలమంది సాధు సంతులతో చలో రామతీర్థంకి పిలుపు ఇవ్వనున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ ప్రధానకార్యదర్శి డా.జివిఆర్.శాస్త్రి తెలిపారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని సిరస్సు ఖండించి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచారని,

ఇంతవరకు ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చెయ్యక పోవటం వెనుక ఏ ఉద్దేశం ఉందని ప్రశ్నించారు. తాను ఇటీవలే సీబీఐ డైరెక్టర్ తో మాట్లాడి అంతర్వేది రథం దగ్ధం కేసు విషయం గూర్చి అడగ్గా అసలు తమకు దర్యాప్తు చెయ్యమని ఎవరూ కోరలేదన్నారని తెలిపారు. పాకిస్థాన్ లో హిందు దేవాలయాలను కొలగొడితే తీవ్రంగా ప్రతిఘటించిన తమ సంస్థ ఈ విషయం వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.