FbTelugu

నారావారి పల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు: చెవిరెడ్డి దాతృత్వం

తిరుపతి: చంద్రగిరి నియోజక వర్గ పరిధిలో కోవిడ్ కో – ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
మంగళవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, చంద్రగిరి ఏరియా ఆసుపత్రిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో 1000 మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. చంద్రగిరి కి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశామన్నారు. చంద్రగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటు కు ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్ సదుపాయం ఏర్పాటు కు కృషి చేస్తున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 ల హోమ్ కిట్స్ ముందస్తుగా సిద్దం చేశామని వివరించారు. అలాగే 2,500 కోవిడ్ కేర్ కిట్లు ముందస్తుగా సిద్దం చేసి ఉంచామన్నారు. చంద్రగిరి, నారావారి పల్లి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల ను అందుబాటులో తీసుకొస్తున్నాం. ఆక్సిజన్ కొరత లేకుండా బల్క్ సిలెండర్ల ను అందుబాటులో తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.