FbTelugu

ఏపీలో కొత్తగా మరో 50 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో మరో ఇద్దరు కరోనా మహమ్మారి సోకి మృత్యువాత పడ్డారు. నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,427 కు చేరింది.

నేటి వరకు ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 73 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,060 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,294కు చేరింది.

You might also like