FbTelugu

50 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నేటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 50,82,660 కి చేరింది. కాగా ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,20,157కి చేరింది.

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 3,29,294 మంది కరోనాతో మృతి చెందారు. అయితే అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో నేటికి 15,91,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 94,994 మంది మృత్యువాత పడ్డారు.

You might also like