FbTelugu

కరోనా రాకుండా 5 రకాల ఉత్పత్తులు: సిరమ్

ఢిల్లీ: కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మొత్తం 5 రకాల ఉత్పత్తులను సిద్ధం చేసినట్లు సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈడీ డాక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. రానున్న డిసెంబర్ నాటికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయని , మూడు దశల ట్రయల్స్ కు సంబంధించిన వివరాలను డిసెంబర్ నాటికే కేంద్రానికి సమర్పిస్తామన్నారు. తాము ఇచ్చిన సమాచారం తో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) సంతృప్తి చెంది అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారంతో వ్యాక్సిన్ అత్యవసరంగా వినియోగించేందుకు లైసెన్స్ ఇచ్చే అవకాశముందన్నారు.

అన్నీ రకాలుగా సంతృప్తి చెందితే మార్కెట్ లోకి విడుదల చేస్తామన్నారు. భారత ప్రభుత్వం అనుమతించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ కు దరఖఆస్తు చేసుకుంటామని అన్నారు. వాళ్లు కూడా అనుమతిస్తే అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుందని జాదవ్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.