FbTelugu

మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం: జగన్

తిరుపతి: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన నష్టంపై ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమిక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా ఘరిష్టంగా చిత్తూరులో6, కడపలో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపారు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జగన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున సాయం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించనున్నట్టు తెలిపారు. వరద ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 15 లోపు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిసెంబర్ 31 లోపు రైతులకు నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.