FbTelugu

5 శతాబ్దాల వివాదం

5-decades-of-conflict

అయోధ్య వివాదం.. 1528 నుంచి 2019 వరకు ఎన్నో కీలక ఘట్టాలు… హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు సరిగ్గా అక్కడే జన్మించాడని హిందువుల విశ్వాసం. ఇక్కడ ఉండే ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారనే వాదన ఉంది. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ మసీదు నిర్మించారని చెబుతారు. అందుకే దీనికి బాబ్రీ మసీదు అనే పేరొచ్చింది. హిందూ సంస్థల కరసేవకులు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు. శతాబ్దాల నాటి అయోధ్య వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుచెప్పనుంది. ఈ క్రమంలో శతాబ్దాల నాటి కేసుకు సంబంధించిన వివరాలను ఎఫ్ బీ తెలుగు.కామ్ మీకు అందిస్తోంది.

1528 అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంగా భావించే ప్రాంతంలో ఒక మసీదు నిర్మాణం

1853లో తొలిసారి ఇక్కడ మతవిద్వేషాలు, ఘర్షణలు

1859లో బ్రిటీష్ పాలకులు వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ నిర్మించి.. హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు.

1949లోమసీదులో రాముడి విగ్రహాలు లభించాయి. కొంతమంది హిందువులు ఈ విగ్రహాలను అక్కడ ఉంచారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అది వివాదాస్పద భూమిగా ప్రకటించింది.

1982లో బాబ్రీ మసీదు ఉన్న స్థానం శ్రీరామ జన్మస్థానం అంటూ.. విశ్వహిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది.

1984లో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్

1986 ఫిబ్రవరి 1వ తేదీన ఫైజాబాద్ సివిల్‌జడ్జి కె.ఎం.పాండే మందిరం తాళాలు తెరిపిస్తూ ఉత్తర్వులు జారీ. దీనికి వ్యతిరేకంగా ముస్లింలు బాబ్రీ మసీదు పోరాట సమితిని ఏర్పాటు.

1986లో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు ఇచ్చిన అనుమతిపై బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం

1986 నవంబరు 9వ తేదీన వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి వీహెచ్‌పీ శంకుస్థాపన

1989లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రామజన్మభూమికి అనుకూల తీర్మానం.

1990 అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ అయోధ్య రాముడి రథయాత్ర ప్రారంభం

1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేత , దేశంలో మతకల్లోలాలు

1992లో ద లిబర్హన్ కమిషన్ ఏర్పాటు

2002 లో అయోధ్య వివాదం పరిష్కరించేందుకు ప్రధానమంత్రి వాజ్‌పేయి అయోధ్య కమిటీ ఏర్పాటు. సీనియర్ నేత శతృఘ్న్ సిన్హాను హిందూ, ముస్లిం నేతలతో చర్చల కోసం నియామకం.

2003 మేలో ‘1992 బాబ్రీ మసీదు కూల్చివేత’ కేసులో అప్పటి ఉపప్రధాని అద్వానీ సహా 8 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు

2005 జులైలో ఐదుగురు సాయుధ మిలిటెంట్లు వివాదాస్పద స్థలంపై దాడి. మిలిటెంట్లను తుదముట్టించిన భద్రతా దళాలు.

2005 జులై 6న : బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో ఉద్రేక పూరిత ప్రసంగం ఇచ్చిన కేసులో అద్వానీ ని కూడా చేర్చాలని కోర్టు ఆదేశం

2010 వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు.

2011 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

2016 జులై 20న బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసులో వాది హషీమ్ అన్సారీ (96) అయోధ్యలో మృతి

2017 అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశం

2019 మార్చిలో మధ్యవర్తుల కమిటీని నియమించిన సుప్రీంకోర్టు

2019 ఆగస్ట్ అయోధ్య వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ వివాదాన్ని పరిష్కరించలేక చేతులు ఎత్తివేత

2019 ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభం

2019 అక్టోబర్‌‌లో సుప్రీంలో ముగిసిన ఇరువర్గాల వాదనలు. రిజర్వ్‌లో తీర్పు

2019 నవంబర్ 9 (శనివారం) సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు.

You might also like