FbTelugu

జులై చివరికి ఢిల్లీలో 5.5 లక్షల కేసులు

డిప్యూటీ సీఎం మనీశ్ వెల్లడి

ఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత ఇప్పట్లో వదిలేలా లేదు. ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న రాజకీయ నాయకులు కొంచెం కొంచెం నిజాలు వెల్లడిస్తున్నారు.

ఢిల్లీలో మరింత తీవ్ర స్థాయిలో కరోనా విస్తరిస్తుందని, మంచాలు దొరక్క రోగులు ఇబ్బంది పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ డిప్యూటీ సీఎం మనిశ్ శిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కరోనా విశ్వరూపం ఏ స్థాయిలో ఉంటుందో ఆయన చెప్పకనే చెప్పారు.  జులై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.

వీరందరికీ కనీసం 80 వేల బెడ్లు అవసరమవుతాయని, ఈ నెలాఖరు వరకు 15 వేల బెడ్లు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే రోగులకు బెడ్లు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజ్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం తరువాత మనీశ్ మీడియాతో మాట్లాడారు.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరగడం లేదని అన్నారు. ఇప్పటి వరకు 27,654 కరోనా కేసులు నమోదు కాగా వీరిలో 10,664 మంది కోలుకున్నారు. 761 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కేసులు పెరుగుతుండటంతో… పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ సమీక్ష నిర్వహించి, తగు సూచనలు చేశారు.

You might also like