FbTelugu

కొడుకు సరదా ఆట… లక్షలు ఆవిరి!

కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసిన ఆన్ లైన్ గేమ్

అమలాపురం: తల్లి సెల్ ఫోన్ ద్వారా ప్రతిరోజు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఆన్ లైన్ గేమ్ కంపెనీ అడిగినప్పుడల్లా ఒకే చెప్పాడు. ఇంకేముందు బ్యాంకులో ఉన్న సొమ్మంతా ఖాళీ అయింది.
ఈ ఘటన గణపతి థియేటర్‌ సమీపంలో జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలుడు సరదాగా తన తల్లి స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ఆడిన ఆన్‌లైన్‌ గేమ్‌తో రూ.5.40 లక్షల దోపిడీకి గురైంది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి తల్లడిల్లుతోంది.
అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. కొద్ది రోజులుగా ప్రేవేటు పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. క్లాసులు వినేందుకు తన స్మార్ట్ ఫోన్ ను కుమారుడికి ఇచ్చేది. ఖాళీ సమయాల్లో బాలుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్‌ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో వెపన్స్‌ కొనాలంటే ఫలానా లింక్‌ ఓపెన్‌ చేయమంటే అదీ కూడా ఓపెన్‌ చేశాడు.

అందులో ఈ గేమ్‌ యాప్‌ నిర్వాహకులు వెపన్స్‌ కొనుగోలు చేసేందుకు రూ.వంద నుంచి ధరలు చూపించాడు. బ్యాంకు ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా టైప్‌ చేసేశాడు. అలా ఒక్కసారి ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే మన బ్యాంక్‌ అకౌంట్ల నమోదు అయ్యే ప్రక్రియ అందులో ఉంటుంది. రూ.వందతో మొదలైన వెపన్స్‌ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరల వరకు వెళ్లింది. ఇరవై రోజులుగా బాలుడు తన స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేయడంతో తల్లికి సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.5.40 లక్షలు డ్రా అయ్యాయి.
తల్లి ఏదో అవసరం పడి ఏటీఎం సెంటర్ కు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్‌ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్‌ ఫోన్‌కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్‌ చూపడంతో తల్లి బెంబెలెత్తిపోయింది. వెంటనే రెండు బ్యాంక్‌లకు వెళ్లి ఆరా తీస్తే రెండు అకౌంట్లలో డబ్బులన్నీ డ్రా అయినట్టు చెప్పడంతో ఆమెకు ముచ్చెమటలు పట్టాయి.
అయితే గేమ్‌ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్‌ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నా ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. భర్త కువైట్‌లో ఉంటూ తాను అక్కడ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్‌లో వేసేవాడు. అలా కూడబెట్టిన సొమ్ముతో కొడుకు సరదాగా ఆడిన ఆట కారణంగా కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసింది. దీనిపై ఆమె స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు చేసింది.

You might also like