FbTelugu

49 మంది వైసీపీ నేతలకు నోటీసులు

అమరావతి: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు, పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో ఇచ్చిన తీర్పుపై హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులపై హైకోర్టు 49 మందికి నోటీసులు ఇచ్చింది.

జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తో పాటు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. జడ్జీలపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్ లపై హైకోర్టు సుమోటోగా తీసుకున్నది. న్యాయ వ్యవస్థ, జడ్జీలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ చేసిన పోస్టింగ్ లపై అడ్వకేట్ వివి.లక్ష్మీనారాయణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

అమరావతి రాజధాని తరలింపు, డాక్టర్ సుధాకర్ రావు కేసు సీబీఐ కి అప్పగింత, గ్రామ పంచాయతీ భవనాల రంగులపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, దానిపై కొందరు వైసీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో విపరీతార్థాలు తీస్తూ పోస్టింగ్ లు పెట్టారు.

You might also like