FbTelugu

తెలంగాణలో ఒక్కరోజే 499 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే కరోనాతో ముగ్గరు కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 198 కి చేరింది. నేటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,526 కు చేరింది.

కొత్తగా నమోదైనా 499 కేసుల్లో 329 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,526 కు చేరింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 3,352 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,976 కు చేరింది.

You might also like